Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
search
Andhra Home

Thatstelugu Telugu news

Thatstelugu Telugu news - తెలుగు వార్తలు  

తెలుగు వార్తలుThatsTelugu News Thats Telugu News ThatsTelugu news headlines ThatsTelugu top stories ThatsTelugu news in Telugu
Share    
  రైతులకు ఏపీ తీపీ, కానీ: జపాన్‌లో చంద్రబాబు బిజీబిజీ
  హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు రాష్ట్ర రైతులకు రుణమాఫీ అమలు చేయనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన నుండి తిరిగి వచ్చాక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి తొలి దశ రుణమాఫీని నేరుగా రైతుల ఖాతాల్లో వేయనున్నారు. 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ తొలి దశ పూర్తి చేయాలని రాష్ట్ర
  మీకే ప్రమాదకరం: మజ్లిస్‌పై కిషన్, నా మంచికే: కేసీఆర్
  హైదరాబాద్: మజ్లిస్ పార్టీతో తెలంగాణ రాష్ట్ర సమితికి పొత్తు ప్రమాదకరమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం హెచ్చరించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రమాదకర పరిస్థితిలోకి వెళ్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం ఛత్తీస్‌గడ్ వెళ్లేందుకు ఆరు నెలలు ఎందుకు పట్టిందన్నారు. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలే ఆయన ప్రభుత్వాన్ని కూలదోస్తాయన్నారు.
  'శారదా స్కాంలో దీదీ అతిపెద్ద లబ్దిదారు'(ఫోటోలు)
  న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న స్కాం శారదా గ్రూప్ చిట్ ఫండ్ స్కాం. ఈ స్కాంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీనే అతిపెద్ద లబ్దిదారు అని తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆమెను తన సమక్షంలో సీబీఐ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. శారదా స్కాంలో ఇప్పటికే
  వావ్! 8 ట్రక్కుల చెత్త ఎత్తారు: ప్రియాంకకు మోడీ పొగడ్త
  న్యూఢీల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పైన ప్రశంసలు కురిపించారు. ప్రియాంకను పొగుడుతూ ఆయన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ కోసం ఆమె వినూత్న ప్రయత్నం చేశారన్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రజలను ఒక్క దగ్గరకు చేర్చేందుకు ఆమె ప్రయత్నం బాగుందని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ
  నివేదిక: జైళ్లలోని ఖైదీల్లో 53శాతం దళితులు, ముస్లింలే
  న్యూఢిల్లీ: ఇండియాలోని జైళ్లలో ఉన్న వారిలో 53 శాతం మంది దళిత, ముస్లిం, ఆదివాసీ తరగతులకు చెందిన వారని ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2013 నుంచి ప్రస్తుతానికి 4.2 లక్షల మంది వివిధ కేసులలో శిక్షను అనుభవిస్తూ జైళ్లలో ఉండగా, అందులో 20 శాతం మంది ముస్లింలు. 22 శాతం మంది దళితులు
  తప్పుకొని, నచ్చిన ఎమ్మెల్యేకివ్వు: జగన్‌కి సోమిరెడ్డి
  హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. అదే సమయంలో ఆయనకు ఓ సూచన చేశారు! పార్టీ అధ్యక్ష పదవి నుంచి జగన్ తప్పుకోవడం మేలన్నారు. జగన్‌లో నైతిక విలువలు ఏమైనా మిగిలి ఉంటే అధ్యక్ష పదవిని
  శంషాబాద్ విమానాశ్రయం దారిలో కారు దగ్ధం
  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రమాదవశాత్తు ఓ కారు మంటల్లో చిక్కుకుంది. కారు నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. నాటుబాంబు పేలి వృద్ధురాలికి గాయాలు అదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో ఓ నాటుబాంబు పేలి ఓ వృద్ధురాలికి
  'సీఎం' పార్కింగ్ స్థలంలో కారు పెట్టట్లేదు: కరుణ చురక
  చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షులు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు తనదైన శైలిలో చురకలు అంటించారు. అసెంబ్లీ సమావేశాలకు కరుణానిధి సరిగా హాజరుకావడం లేదని పన్నీర్ సెల్వం ఇటీవలే వ్యాఖ్యానించారు. దీనికి కరుణ ఆదివారం స్పందించారు. సభలో మెరుగైన సీటింగ్ అమరిక ఏర్పాటు చేస్తే, తాను సభకు వస్తానని సమాధానమిచ్చారు. తనకు
  మిత్రుడితో భార్యపై అత్యాచారం: భర్తకు పదేళ్ల జైలు శిక్ష
  న్యూఢిల్లీ: తన భార్యపై మిత్రుడితో అత్యాచారం చేయించిన ఓ భర్తకు ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలి వాంగ్మూలం, వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా అతనికి కోర్టు ఆ శిక్ష విధించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందనే వాదనను తోసిపుచ్చుతూ బాధితురాలి భర్తకు, అతని మిత్రుడికి అదనపు సెషన్స్ జడ్జి ఎంసి గుప్తా
  టీడీపీకి, మాకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా: జగన్
  హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, మాకు కేవలం 5 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లా పార్టీ సమీక్షా సమావేశాల్లో భాగంగా ఒంగోలులో మాట్లాడారు. ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు చంద్రబాబు ఎన్నో అబధ్దాలు చెప్పారని
  రేవంత్‌ని టార్గెట్ చేశారు: టీడీపీ, కేసీఆర్ బొమ్మ దగ్ధం
  హైదరాబాద్: అసెంబ్లీలో తమ పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డిని అధికార తెరాస పార్టీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత సభాపతి పైన ఉందని తెలంగాణ టీడీపీ నేతలు అన్నారు. మధ్యాహ్నం వారు సభాపతి మధుసూదనాచారితో భేటీ అయ్యారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై రెండు పేజీల లేఖను ఆయనకు అందజేశారు. బీఏసీలో ఇద్దరికి
  ఎబిఎన్‌ నిలిపివేత: ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
  న్యూఢిల్లీ/ హైదరాబాద్: తెలంగాణలో ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రసారాల నిలిపివేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేస్తూ ఎంఎస్‌వోలు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎంఎస్‌వోలతో

1 2 3 4 5 6 7 8 9 Next


Tags : thatstelugu,Oneindia Telugu, one india telugu,thatstelugu site,thatstelugu portal,thatstelugu news,thatstelugu.com,oneindia andhra pradesh,thatstelugu andhra news, thats telugu,thats telugu news live,thats telugu oneline news,thats telugu portal,thats telugu headlines,thats telugu top news,thats telugu website, thatstelugu websiite,andhra pradesh news, thatstelugu andhra news, thatstelugu news,thatstelugu live,thatstelugu online,telugu people,thatstelugu live news

Add Thatstelugu Telugu news to your blog or website