Bollywood Finance Sports Technology Andhra Tamilnadu Karnataka Kerala  
search
Andhra Home

Web Duniya Telugu News

Web Duniya Telugu News - తెలుగు వార్తలు  

తెలుగు వార్తలుWebduniya Telugu Webduniya Telugu News Web Duniya Telugu Headlines Web Duniya Telugu top stories  Webdiniya News in Telugu
Share    
  దానం నాగేందర్ ఓ కబ్జాకోరు : షర్మిల ఘాటు విమర్శలు
  మాజీ మంత్రి దానం నాగేందర్ ఓ కబ్జాకోరు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల ఘాటు విమర్శలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్న పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి మద్దతుగా ఆమె ఆదివారం ప్రచారం చేశారు.
  కేసీఆర్ గుండెల్లో ఓటమి భయం : వెంకయ్య నాయుడు
  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుండెల్లోఓటమి భయం నెలకొందని, అందువల్ల ఆయన తమ పార్టీపైనా, టీడీపీ - బీజేపీ పొత్తుపైనా అసత్య ప్రచారం చేస్తూ బురదజల్లుతున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు.
  తెలుగు జాతి కోసమే పార్టీ పెట్టా : కిరణ్ కుమార్ రెడ్డి
  తాను తెలుగు ప్రజలు, తెలుగు జాతి శాశ్వతంగా కలిసివుండాలన్న ఉద్దేశ్యంతోనే జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించినట్టు మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతేకానీ పదవుల కోసం పార్టీ పెట్టలేదన్నారు.
  రాష్ట్రంలో టీడీపీ - బీజేపీ కూటమిదే విజయం: ఆజ్‌తక్ సర్వే
  రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ - బీజేపీదే విజయమని ప్రముఖ హిందీ ఛానల్ ఆజ్‌తక్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఆ రెండు పార్టీలకు ఎంతగానో కలిసి వచ్చిందని ఈ సర్వే తేల్చింది.
  శైలజానాథ్‌పై శివాలెత్తిన ఎమ్మెల్సీ శమంతకమణి!
  రాష్ట్ర మాజీ మంత్రి శైలజానాథ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి శివాలెత్తారు. సభ్యత్వం లేకున్నా సిగ్గు లేకుండా టీడీపీ తరపున పోటీ చేయడానికి వచ్చావా అంటూ శైలజానాథ్‌ను ఆమె నిలదీశారు. శనివారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిగా తహశీల్దారు కార్యాలయంలో శైలజానాథ్ నామినేషన్ దాఖలు చేస్తుండగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో దూషించారు.
  బాబా రాందేవ్ ఓ హవాలా వ్యాపారి : దిగ్విజయ్ సింగ్
  ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ హవానా వ్యాపారి అని కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. రాందేవ్‌ని హవాలా వ్యాపారిగా అభివర్ణిస్తున్నానంటూ ఆయన ఆదివారం ట్వీట్స్ చేశారు.
  కేసీఆర్‍కు ఎన్నికలపుడే కేవీపీ ఆఫర్ గుర్తొచ్చిందా : పొన్నాల
  తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిని మూసి వేస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తన ప్రాణ స్నేహితుడు డాక్టర్ కేవీపీ ద్వారా చేసిన ఆఫర్ ఈ ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చిందా అని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
  తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీడీపీ రావాలి : చంద్రబాబు
  తెలంగాణ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా తాము చేసిందేనని ఆయన అన్నారు.
  టీడీపీ చీఫ్ చంద్రబాబు హిట్లర్‌తో సమానం : వైఎస్ షర్మిల
  హిట్లర్ ఎంత నియంతో... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంతే నియంత అని వైఎస్ఆర్ సీపీ మహిళా నేత వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. హిట్లర్‌కు ఎంత అధికార దాహమో చంద్రబాబుకూ అంతే అధికార దాహమన్నారు. ఇద్దరూ ఒకే రోజున పుట్టారని ఆమె తెలిపారు.
  ఓటర్లను ప్రలోభ పెడితే యేడాది జైలు : భన్వర్ లాల్
  సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెడితే ఒక యేడాది జైలుశిక్ష తప్పదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. రాష్ట్రంలో ఓటర్లు మొత్తం 6.48 కోట్లు, అందులో పురుషులు 3.26 కోట్లు, మహిళలు 3.22 కోట్లు కాగా, 18-19 ఏళ్ల వయస్సున్న యువ ఓటర్లు 33 లక్షలు ఉన్నట్టు తెలిపారు.
  దక్షిణ కొరియా నౌక ప్రమాదం : కెప్టెన్ అరెస్టు!
  దక్షిణ కొరియాలో సముద్రంలో మునిగిపోయిన నౌక కెప్టెన్ లీ జూన్ సియోక్‌తో పాటు.. మరో ఇద్దరు క్రూ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 476 మందితో వెళుతున్న నౌక సముద్రంలో ఒరిగిపోతున్నా ప్రయాణికులను ఖాళీ చేయించడంపై ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడాన్ని కెప్టెన్ సమర్థించుకున్నారు. ప్రమాద సమయంలో సరిగ్గానే వ్యవహరించానని చెప్పుకొచ్చారు.
  ఇన్‌సైడర్ ట్రేడింగ్ : జూన్ 17 నుంచి రజత్‌గుప్తాకు జైలుశిక్ష
  అమెరికాలో అతిపెద్ద ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో పట్టుబడిన ప్రవాస భారతీయుడు, గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డైరెక్టర్ రజత్ గుప్తాకు విధించిన రెండేళ్ల జైలుశిక్ష జూన్ 17వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును రజత్ గుప్తా పై కోర్టులో సవాల్ చేసి ఓడిపోయారు. దీంతో యూఎస్ జిల్లా కోర్టు జడ్జి జేడ్ రాకాఫ్ ఆయన్ని జూన్ 17న మధ్యాహ్నం రెండు గంటలలోపల లొంగిపోవాలని ఆదేశించారు.

1 2 3 4 5 6 7 8 9 Next


Tags : webduniay,webduniya telugu, web duniya telugu, webduniya telugu news, web duniya andhra, webduniya andhra pradesh, webduniya telugu news, webduniya telugu headlines, webduniya telugu website,webduniya ap news, webduniya live telugu news,webduniya telugu news online, webduniya telugu news live,webduniya telugu movies, webduniya, webduniya telugu main news,webduniya telugu state news, webduniya telugu language,telugu websites,telugu website,telugu news website,telugu news live

Add Web Duniya Telugu News to your blog or website
About Us - Disclaimer - Privacy Policy - Contact Us - © Copyrights & Disclaimer. All Rights Reserved.
facebook   twitter